హైదరాబాద్ జీడిమెట్ల పారిశ్రామిక వాడలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. వాణి కెమికల్ కంపెనీ ముందు ఆగి ఉన్న లారీ తగలబడి పోయింది. అందులో హార్డ్వేర్ సామాన్లు ఉన్నట్లు తెలిసింది. ఈ మంటల దాటికి పక్కనే ఆగి ఉన్న మరో హెచ్ఎం.డబ్ల్యూఎస్ వాటర్ ట్యాంకర్ సైతం అగ్నికి ఆహుతై పోయింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది.. ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు.