డిసెంబర్ 4 న  పుష్ప 2(pushpa 2)బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోవడం తెలిసిందే.ఈ విషయంపై పోలీసులు అల్లు అర్జున్ తో పాటు చిత్ర యూనిట్,సంధ్య థియేటర్ యాజమాన్యం తో పాటు పలువురి పై కేసు నమోదు చేసింది.ఈ కేసులో  అల్లు అర్జున్ ఒక రోజు జైలు లో కూడా ఉన్నాడు.

ఇక ఈ కేసులో అల్లు అర్జున్ హైకోర్టు  మధ్యంతర బెయిల్  పై బయట ఉన్న విషయం తెలిసిందే.దీంతో రెగ్యులర్ బెయిల్‌ కోసం అల్లు అర్జున్ తరుపు లాయర్లు నాంపల్లి కోర్టులో పిటిషన్ వెయ్యగా కోర్టు తీర్పుని ప్రకటించింది.50 వేల రూపాయలు,ఇద్దరి సాక్ష్య సంతకాలతో  అల్లు అర్జున్(allu arjun)కి  రెగ్యులర్ బెయిల్ ని ఇస్తూ కోర్టు తీర్పుని ప్రకటించింది.అల్లు అర్జున్ కి ఈ తీర్పు పెద్ద ఊరటని ఇచ్చే అంశమని చెప్పవచ్చు. ప్రతి ఆదివారము చిక్కడపల్లి పోలీసుల ముందు వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలంటు కూడా కోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది.అదే విధంగా  సాక్షులను ప్రభావితం చెయ్యడం గాని,కేసుని ప్రభావితం చేసే విధంగా బహిరంగంగా మాట్లాడటం కానీ చేయవద్దని కూడా న్యాయస్థానం తన తీర్పులో వెల్లడి చెయ్యడం జరిగింది.

 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here