ప్రతీ ఒక్కరు కూడా జీవితంలో సక్సెస్ అవ్వాలని.. అనుకున్నవన్నీ పూర్తి చేయాలని అనుకుంటారు. కానీ కొంత మంది మాత్రమే వాటిని పూర్తి చేయగలుగుతారు, మరి కొంతమంది మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. నిజానికి ఎప్పుడూ కూడా దేనినైనా సాధించాలంటే అందుకోసం ఎంతగానో కష్టపడాలి. ఏ రోజూ కూడా ఏ పనిని మధ్యలో వదిలిపెట్టకూడదు.