ఎప్పుడూ ఇవే చప్పటి ఇడ్లీలు తినాలా..? స్పైసీగా ఏమైనా చేసి పెట్టచ్చు కదమ్మా.. అని పిల్లలు తరచూ అడుగుతున్నారా? అయితే ఇది మీ కోసమే. మీరు ఎప్పుడూ చేసే మామూలు ఇడ్లీలతోనే ఇంట్లో వాళ్లకీ నచ్చేలా కొత్తగా ఒక పదార్థాన్ని తయారు చేయచ్చు. ముఖ్యంగా పిల్లలు ఇష్టంగా తినేలా స్పైసీగా, ఈజీగా చేసి పెట్టచ్చు. ఉదయాన్నే ఇడ్లీలు తినడం నచ్చకపోయినా, సాయంత్రానికి ఇడ్లీలు మిగిలిపోయినా ఇలా స్పైసీ తవా ఇడ్లీలను తయారు చేసి పెట్టండి.ఈ రెసినీ అందరికీ కచ్చితంగా నచ్చుతుంది. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌గా, సాయంత్రం స్నాక్స్‌గా ఉపయోగపడే స్పైసీ తవా ఇడ్లీని ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి..