ప్రముఖ డిజిటల్ ఛానల్ ‘తెలుగువన్'(Teluguone)నిర్మించిన వెబ్ సిరీస్ లలో ‘పాష్ పోరిస్'(Posh poris)కూడా ఒకటి.  మహిళా దర్శకురాలు మల్లాది అపర్ణ(Malladi Aparna)దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సిరిస్  2016 లో ప్రేక్షకుల ముందుకు రాగా ‘తెలుగువన్’ ఛానల్ లో మిలయన్స్ వ్యూస్ ని రాబట్టి ఒక సరికొత్త చరిత్రని సృష్టించింది.ఎనిమిదేళ్ల క్రితమే లివింగ్ రిలేషన్ షిప్ గురించి చెప్పిన ఈ సిరీస్ ఎన్నో మోడరన్  సినిమాలకి ఇన్స్పిరేషన్ గా కూడా నిలిచిందని చెప్పవచ్చు.

ఈ రోజు అనుకోకుండా దర్శకురాలు అపర్ణ హఠాన్మరణం చెందారు. హెల్త్ ఇష్యుస్ వల్లనే అని తెలుస్తుంది.దీంతో ‘పాష్ పోరిస్’ బృందం ఒక్కసారిగా షాక్ కి గురయ్యింది.’తెలుగువన్’ కి ఆమెతో గాని, ఆమెకి ‘తెలుగువన్’ తో గాని మంచి అనుబంధం ఉంది.దీంతో ఆమె మృతి పట్ల ‘తెలుగువన్’ అధినేత కంఠంనేని రవిశంకర్(Kantamneni Ravi shankar)తో పాటు స్టాఫ్ తీవ్ర దిగ్రాంతిని వ్యక్తం చెయ్యడం జరిగింది.వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ,ఆమె కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియచేసారు

.  

‘పాష్ పోరిస్’ తో పాటు కొన్ని సినిమాలకి కూడా పని చేసిన అపర్ణ  లాస్ ఏంజిల్స్ లో బెస్ట్   ఫిల్మ్ మేకర్.శాన్ ఫ్రాన్సిస్కోలోని ఫిల్మ్ ఆర్ట్స్ ఫౌండేషన్‌లో ఫిల్మ్ మేకింగ్ నేర్చుకుంది.2001లో ఆమె తెరకెక్కించిన షార్ట్ ఫిల్మ్ నూపూర్ 25 కంటే ఎక్కువ అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలలో ప్రదర్శించబడింది.USA ఫిల్మ్ ఫెస్టివల్, డల్లాస్‌లో ఫ్యామిలీ అవార్డు మరియు రోచెస్టర్‌లో బెస్ట్ ఆఫ్ ది ఫెస్ట్‌లో చేర్చడానికి కూడా నూపుర్ ఆహ్వానించబడింది.2009 లో  మిట్సేన్ అనే సినిమాకి దర్శకురాలుగా కూడా వ్యవహరించింది. 

ఈ చిత్రం యూజీన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, ఒరెగాన్‌లో ఉత్తమ ఆర్ట్ ఫిల్మ్‌గా ట్రోఫీని గెలుచుకోవడమే కాకుండా  ఫిల్మ్ ఇండియా వరల్డ్‌వైడ్ విభాగంలో ముంబై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అంతర్జాతీయ ప్రీమియర్‌ను కూడా జరుపుకుంది.’ది అనుశ్రీ ఎక్స్‌పరిమెంట్స్ ‘అనే మరో చిత్రానికి కూడా దర్శకత్వం వహించింది.ఇక అపర్ణ మృతి పట్ల రచయితల సంఘం తరుపున స్టార్ రైటర్ పరుచూరి గోపాలకృష్ణ(Paruchuri Gopala krishna)తో పాటు సంఘ సభ్యులు కూడా తమ సంతాపాన్ని తెలియచేసారు.రచయితల సంఘానికి అపర్ణ  శాశ్వత సభ్యురాలిగా ఉంది.

 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here