భార్యాభర్తల మధ్య బంధం నమ్మకం, ఒకరిపై ఒకరికి ప్రేమ, అంకితభావంపై ఆధారపడి ఉంటుంది. ఈ విషయాలేవీ బంధంలో తగ్గినా కూడా ఆ బంధం విచ్చిన్నమైపోతుంది. చాలాసార్లు, చక్కగా సాగుతున్న వైవాహిక జీవితంలో మూడవ వ్యక్తి ప్రవేశించి భార్యాభర్తల అనుబంధంలో చిచ్చుపెడతారు. ముఖ్యంగా పురుషులే ఎక్కువగా మోసం చేస్తారనే నమ్మకం ఉంది. అయితే మోసం అనేది మగవారికే ఆపాదిస్తున్నప్పటికీ…అది ఒక నిర్దిష్ట లింగానికి సంబంధించిన విషయం కాదు. ఆడవారు కూడా మోసం చేయవచచు. పెళ్లయిన తరువాత కూడా వేరొకరి పట్ల ఆకర్షితులు కావడం, ఇతరులతో రిలేషన్ షిప్ పెట్టుకోవడం సమాజంలో ఎక్కువైపోయింది. అయితే ఇలా ఎందుకు జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. దీనికి బలమైన కారణం ఏదీ లేదు, కానీ తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. ఆ విషయాలనే అధ్యయనం చెబుతోంది.