ssmb 29 ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఎదురుచూస్తున్నమహేష్,రాజమౌళి(rajamouli)అభిమానులకి, సినీ అభిమానులకి నిన్న పండగ రోజని చెప్పవచ్చు.ముందస్తు సమాచారం లేకుండా ఎటువంటి హడావిడి లేకుండా, హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో నిన్న ssmb 29 పూజా కార్యక్రమాలతో ప్రారంభమయ్యింది.కేవలం యూనిట్ సభ్యులు మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.   

ఇక ఈ మూవీ విషయంలో మహేష్(mahesh babu)తన సెంటిమెంట్ ని బ్రేక్ చేసాడని చెప్పవచ్చు.జనరల్ గా  మహేష్ తన సినిమా ప్రారంభోత్సవానికి హాజరు కాడు.అలా హాజరుకాకపోవడాన్ని మహేష్ చాలా కాలం నుంచి ఒక సెంటిమెంట్ గా పెట్టుకున్నాడనే మాటలు ఫిలిం సర్కిల్స్ లో వినపడుతుంటాయి.మహేష్ తరుపున నమ్రత హాజరయ్యి పూజా కార్యక్రమాల్లో పాల్గొంటుంది.కానీ ఈ సారి మహేష్ తన సెంటిమెంట్ ని పక్కన పెట్టి  ssmb 29 పూజా కార్యక్రమానికి హాజరయ్యాడు.దీంతో జక్కన్న కోసం మహేష్ తన సెంటిమెంట్ ని మార్చుకున్నాడని అంటున్నారు.

ఇక ఈ మూవీ భారతీయచిత్ర పరిశ్రమలో ఇంతవరకు తెరకెక్కని ఒక సరికొత్త కాన్సెప్ట్ తో సరికొత్త విజువల్స్ తో తెరకెక్కబోతుందనే వార్తలు ఫిలింసర్కిల్స్ లో వినిపిస్తున్నాయి.చిత్ర రచయిత విజయేంద్ర ప్రసాద్ కూడా చాలా ఇంటర్వూస్ లో అమెజాన్ అడవుల నేపథ్యంలో తెరకెక్కుతుందని చెప్పిన విషయం తెలిసిందే.పైగా ఆర్ఆర్ఆర్ తో రాజమౌళి ఆస్కార్ ని అందుకొని హాలీవుడ్  ప్రేక్షకులని కూడా తన వైపు  చూసేలా చేసుకున్నాడు.దీంతో భారతీయ చిత్ర పరిశ్రమకి చెందిన నటులే కాకుండా ప్రపంచ నటులు కూడా ssmb 29 లో నటించబోతున్నారనే టాక్ వినపడుతుంది.ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని దుర్గ ఆర్ట్స్ పతాకంపై కె ఎల్ నారాయణ(kl narayana)నిర్మిస్తుండగా కీరవాణి(keeravani)సంగీతాన్ని అందిస్తున్నాడు.ప్రియాంక చోప్రా(priyanka chopra)హీరోయిన్ గా చేస్తుందనే టాక్ అయితే చాలా బలంగానే వినపడుతుంది.మూవీకి సంబంధించిన మిగతా వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.

 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here