రెండో పొడవైన ఫ్లైఓవర్..
ఈ ఫ్లైఓవర్ 4.04 కిలోమీటర్లు ఉంది. ఇది హైదరాబాద్‌లోని రెండో పొడవైన ఫ్లైఓవర్‌గా నిలిచింది. ఆరు లేన్లలో దీన్ని నిర్మించారు. రెండు వైపులా రాకపోకలు సాగించవచ్చు. ఆరాంఘర్ ఫ్లైఓవర్ ప్రారంభించిన తర్వాత.. హైదరాబాద్‌లోని అనేక కీలక ప్రాంతాలలో ట్రాఫిక్ రద్దీ తగ్గనుంది. ముఖ్యంగా ఆరాంఘర్, శాస్త్రిపురం, కాలాపత్తర్, దారుల్ ఉలూమ్, శివ్రాంపల్లి, హసన్‌నగర్ ప్రాంతాల్లో ట్రాఫిక్ కష్టాలు తగ్గనున్నాయి.