బీజేపీ, కాంగ్రెస్ బీసీలకు అన్యాయం చేసిన పార్టీలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. ప్రతి ఒక్కరి చరిత్ర తీసి చేసిన అన్యాయాన్ని ఎండగడతామని స్పష్టం చేశారు. ఏళ్లకు ఏళ్లు బీరువాల్లో కమిషన్ల రిపోర్టులు కాంగ్రెస్ పార్టీ దాచి పెట్టిందని విమర్శించారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలుతోపాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ బీసీ మహా సభకు పెద్ద ఎత్తున బీసీ సంఘాలు వచ్చాయి.