వెబ్ సిరీస్ : డాక్టర్స్

నటీనటులు:  శరద్ కేల్కర్, హర్లిన్ సేథి, అమీర్ అలీ, విరఫ్ పటేల్, వివాన్ షా తదితరులు

ఎడిటింగ్: సత్య శర్మ

సినిమాటోగ్రఫీ: వివేన్ సింగ్

మ్యూజిక్: సౌట్రిక్ చక్రవర్తి

నిర్మాతలు: జ్యోతి దేశ్ పాండే, సిద్దార్థ్ మల్హోత్రా

దర్శకత్వం: సాహిర్ రాజా

ఓటీటీ: జియో సినిమా

కథ: 

ముంబై సిటీలో ఒక పెద్ద కార్పోరేట్ హాస్పిటల్. అక్కడ ఇషాన్ ( శరద్ కేల్కర్) నిత్యా వాసన్ ( హర్లిన్ సేథి) డాక్టర్స్ గా పనిచేస్తూ ఉంటారు. వీరితో పాటు నహిదా, కే .. రాయ్ , రితిన్, లేఖ కూడా డాక్టర్స్ గా వర్క్ చేస్తుంటారు. జూనియర్ డాక్టర్స్ అందరిని సబీహా హ్యాండిల్ చేస్తుంటుంది.  డాక్టర్ లేఖతో ఇషాన్ కి ఎంగేజ్ మెంట్ అవుతుంది. అనారోగ్య కారణాల వలన నిత్య భర్త మంచానికి పరిమితమవుతాడు. తన పరిస్థితికి ఇషాన్ కారకుడని భావించిన నిత్య భర్త, అతనిపై కోపంతో ఉంటాడు. కొన్ని రోజులకి నిత్య, ఇషాన్ ఇద్దరు దగ్గరవుతారు. లేఖతో జరిగిన ఎంగేజ్ మెంట్ ను ఇషాన్ పెద్దగా పట్టించుకోడు. నిత్య – ఇషాన్ సాన్నిహిత్యంగా ఉండటాన్ని లేఖ చూస్తుంది. వాళ్ల మధ్య సంబంధం ఉందనే విషయం తనకి అర్థమవుతుంది. నిత్య, ఇషాన్ రిలేషన్ లో ఉన్నారని తెలుసుకున్న లేఖ ఏం చేసింది? ఆమె తీసుకున్న నిర్ణయం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందనేది మిగతా కథ. 

విశ్లేషణ:

ఇద్దరు ప్రధాన డాక్టర్స్ మధ్య లవ్ ట్రాక్ ని కొత్తగా చూపించాలనుకున్నాడు దర్శకుడు కానీ ఇది కాస్త నిరాశే మిగిలుస్తుంది. ఎందుకంటే కథ గ్రిస్పింగ్ గా లేకపోవడం ఒకటైతే స్లోగా సాగే కథనం చికాకు తెప్పిస్తుంది. దర్శకుడు ఒక వైపున హాస్పిటల్లోని వాతావరణం, మరో వైపున డాక్టర్స్ వ్యక్తిగతమైన ఫీలింగ్స్ ను చూపిస్తూ వెళ్లాడు. హాస్పిటల్ కి వచ్చే ప్రమాదకరమైన కేసులు, స్ట్రెచర్లు, సైరన్లు, ఐసీయులు, ఆపరేషన్లు, రక్తపాతాలు, మరణాలు ఈ హడావిడి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. నిజానికి ఇలాంటి ఒక వాతావరణం చాలామందికి నచ్చదు. ఎవరైనా బాగుండాలనే కోరుకుంటారు అంతేకానీ హాస్పిటల్ లో ఉండాలని కాదు అందుకే దర్శకుడు ఈ కథని ఆడియన్ కి కనెక్ట్ చేయడానికి టైమ్ పట్టింది.

లవ్ , ఎమోషన్స్ తో కూడిన ఈ కథ ప్రేక్షకులని ఆకట్టుకుంటుందా అంటే ఆకట్టుకోలేదనే చెప్పాలి. హాస్పిటల్ వాతావరణంలో ఉండటానికి ఎంతమాత్రం ఇష్టపడరు. అందువలన మొదటి ఎపిసోడ్ నుంచి చివరి ఎపిపోడ్ వరకూ హాస్పిటల్లోనే సాగే ఈ సిరీస్ ను ఫాలో కావడం కాస్త కష్టమైన విషయమనే చెప్పాలి. కొన్ని ప్రమాదాలు .. రక్తపాతం .. సర్జరీలు నేరుగా చూపించడం కొంతమందికి మరింత కంగారు పెట్టే విషయం. కథనం నిదానంగా సాగడం కూడా అసంతృప్తిని కలిగించే అంశమనే చెప్పాలి. 

మొదటి ఎపిసోడ్ నుండి చివరి వరకు కథ స్లోగా సాగుతుంది.‌ ఇది ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షేంచేదిలా అనిపిస్తుంది. కొత్తగా డాక్టర్ కోర్స్ నేర్చుకునేవారికి తప్ప ఏదో మంచి కంటెంట్ కోసం, ఎంటర్‌టైన్‌మెంట్ కోసం చూడాలనుకుంటే సూది దిగినట్టే ఉంటుంది. హాస్పిటల్ లో ప్రేమ, ఎమోషన్స్ చూపించాలనుకున్నాడు దర్శకుడు కానీ అది ఎంగేజింగ్ గా లేకపోవడం  పెద్ద మైనస్. ప్రధాన పాత్రలు చేసిన హీరో, హీరోయిన్ ల క్యారెక్టర్స్ ని ఇంకాస్త స్ట్రాంగ్ గా రాసుకుంటే బాగుండేది.  ఎడిటింగ్ ఓకే. మ్యూజిక్ పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

నటీనటుల పనితీరు: 

ఇషాన్ గా శరద్ కేల్కర్, నిత్యా వాసన్ గా హర్లిన్ సేథి డాక్టర్స్ గా ఆకట్టుకున్నారు. మిగతా వారు వారి పాత్రల పరిధి మేర నటించారు.

ఫైనల్ గా : స్లోగా సాగే రొటీన్ డ్రామా. ఆడియన్స్ ఓపికకి పరీక్షే ఈ డాక్టర్స్.

రేటింగ్:  1.75 / 5

✍️. దాసరి  మల్లేశ్

 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here