సీఎం సపోర్ట్
దేవాలయాల్లోకి చొక్కా లేకుండా వెళ్లే సంప్రదాయాన్ని నిషేధించాలన్న వాదనను ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ కూడా సమర్ధించారు. ‘దేవస్థానం బోర్డు ప్రతినిధి ఒకరు ఈ రోజు నన్ను కలిశారు. తాము ఆ నిర్ణయం తీసుకోబోతున్నామని చెప్పారు. బాగుందని చెప్పాను… చాలా మంచి సూచన’ అని సీఎం విజయన్ విలేకరులతో అన్నారు. కేరళలో గురువాయూర్, ట్రావెన్ కోర్, మలబార్, కొచ్చిన్, కూడల్ మాణిక్యం అనే ఐదు ప్రధాన దేవస్వామ్ లు కలిసి దాదాపు 3,000 దేవాలయాలను నిర్వహిస్తున్నాయి.