ఆపింది కాంగ్రెస్..
’11 సీజన్లలో రూ.73 వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేశాం. 12వ సీజన్లో రైతులకు ఇవ్వాల్సిన డబ్బులను ఆపింది కాంగ్రెస్. సంవత్సరం దాటిపోయినా ఈరోజు వరకు ఒక్క రూపాయి కూడా రైతన్నలకు ఇయ్యలేదు. ఆరోజు మేము దాచిపెట్టిన రూ.7500 కోట్లు మాత్రమే ఇచ్చారు. ఎన్నికలకు ముందు వరంగల్లో రాహుల్ గాంధీని తెచ్చి రైతన్నలను ఉద్ధరిస్తామని చెప్పారు. రైతు డిక్లరేషన్‌లో భాగంగా ఎకరానికి రూ.15 వేలు, కౌలు రైతులకు, రైతు కూలీలకు ఆర్థిక భరోసా ఇస్తామని ప్రకటించారు. ఇన్ని రకాల హామీ ఇచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడు రైతులతోనే ప్రమాణ పత్రాలు తీసుకుంటుంది’ అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.