డిసెంబర్ 4 న  పుష్ప 2(Pushpa 2)బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోయిన కేసులో మధ్యంతర బెయిల్ తో బయట ఉన్న  అల్లు అర్జున్ కి రీసెంట్ గా నాంపల్లి కోర్టు 50 వేల రూపాయలు,ఇద్దరి సాక్ష్య సంతకాలతో  రెగ్యులర్ బెయిల్ ని ఇస్తూ తీర్పుని ప్రకటించిన విషయం తెలిసిందే.


దీంతో  అల్లు అర్జున్(Allu arjun)ఈ రోజు  నాంపల్లి కోర్టు కు వెళ్లి బెయిల్ కు సంబంధించిన పూచీకత్తు పత్రాలు సమర్పించనున్నారు.శనివారం కాబట్టి లంచ్ సమయం లోపలే కోర్టుకు వెళ్లనున్నట్లు సమాచారం.ఇక అల్లు అర్జున్ కి ఈ తీర్పు పెద్ద ఊరటని ఇచ్చే అంశమని చెప్పవచ్చు. ప్రతి ఆదివారము చిక్కడపల్లి పోలీసుల ముందు వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలంటు కూడా కోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది.అదే విధంగా  సాక్షులను ప్రభావితం చెయ్యడం గాని,కేసుని ప్రభావితం చేసే విధంగా బహిరంగంగా మాట్లాడటం కానీ చేయవద్దని కూడా న్యాయస్థానం తన తీర్పులో వెల్లడి చెయ్యడం జరిగింది.

 


 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here