విశ్వ విఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు(Ntr)నట వారసుడుగా సినీ రంగ ప్రవేశం చేసి,ఐదు దశాబ్దాలుగా తన నటనతో అశేష తెలుగు సినీ ప్రేక్షకులని అలరిస్తూ వస్తున్న హీరో నందమూరి బాలకృష్ణ(Balakrishna)ఎంత పెద్ద డైలాగ్ ని అయినా సరే,ఫస్ట్ నుంచి చివరకి దాకా అదే టెంపోతో  డైలాగుని చెప్పగల ఒకే ఒక్కే హీరో బాలయ్య అని కూడా చెప్పుకోవచ్చు.ఈ విషయాన్నీ చాలా మంది హీరోలు చెప్పారు.ఇక ఆహా వేదికగా బాలయ్య వన్ మాన్ షో అన్ స్టాప‌బుల్ 4 స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. లేటెస్ట్ ఎపిసోడ్ లో తన అప్ కమింగ్ మూవీ ‘డాకు మహారాజ్’ టీం పాల్గొంది.

ఈ సందర్భంగా థమన్(thaman)అడిగిన ఒక ప్రశ్నకి  బాలకృష్ణ స్పందిస్తు నా కూతుళ్లిద్దరినీ ఎంతో ఆప్యాయంగా,శ్రద్ధగా పెంచాను.పెద్ద కూతురు బ్రాహ్మణి కి ప్ర‌ఖ్యాత ద‌ర్శ‌కుడు మణిరత్నం నుంచి  హీరోయిన్ ఆఫర్ వచ్చింది.ఈ విషయాన్నీ బ్రాహ్మణి(Brahmani)దృష్టికి తీసుకు వెళ్తే నటనపై ఆసక్తి లేదని ఆఫర్ ని తిరస్కరించింది.చిన్న కుమార్తె తేజస్విని(Tejaswini)అద్దం ముందు నటించేది.దీంతో ఆమె నటనలో వృత్తిని కొనసాగించగలదనే నమ్మకం కలిగింది. కానీ తేజస్విని ప్రస్తుతం టాక్ షో కోసం క్రియేటివ్ కన్సల్టెంట్‌గా పని చేస్తుంది.కుమార్తెలు ఇద్దరూ తమకి ఇష్టమైన రంగాల్లో రాణించ‌డం మా కుటుంబానికి గర్వకారణం.వాళ్లు నా కూతుళ్లని గర్వంగా చెప్పుకునే స్థాయికి చేరుకోవడం కంటే నాకింకేం కావాలని  బాల‌య్య తన ఆనందం వ్య‌క్తం చేసాడు. బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఇవ్వనున్న విషయం తెలిసిందే. 

ఇక బాలయ్య అప్ కమింగ్ మూవీ ‘డాకు మహారాజ్'(Daku maharaj)సంక్రాంతి కానుకగా ఈ నెల 12 న విడుదల కాబోతుంది.బాలకృష్ణ కెరీర్ లోనే అత్యధిక థియేటర్స్ లో విడుదలవుతున్న   ఈ మూవీపై బాలయ్య అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోను భారీ అంచనాలు ఉన్నాయి. ప్రమోషన్స్ లో భాగంగా ఈ రోజు యుఎస్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుండగా,బాలయ్య తో పాటు చిత్ర బృందం యుఎస్ కి బయలుదేరి వెళ్ళింది.

 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here