ఆంధ్రప్రదేశ్‌లోని ఇంటర్‌ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. విజయవాడ పాయకాపురం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఈ కార్యక్రమాన్ని పునఃప్రారంభించారు. బాగా చదువుకుంటేనే మంచి ఉద్యోగం వస్తుందని.. మంచి ఉద్యోగం వస్తే కుటుంబాన్ని బాగా చూసుకోవచ్చని లోకేష్ విద్యార్థులకు సూచించారు. ప్రైవేట్‌ స్కూళ్లు, కాలేజీలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలను తీర్చిదిద్దుతున్నట్లు వివరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here