గణేష్ మాష్టర్ అంటే ఢీ షో గుర్తొస్తుంది. అందులో జడ్జ్ గా ఆయన చేస్తున్నారు. ఇక డాన్సర్స్ చేసే డాన్స్ విషయంలో ఆయన మొహమాటం లేకుండా ఉన్నది ఉన్నట్టుగా జడ్జిమెంట్ ఇస్తారు. అలాంటి గణేష్ మాష్టర్ కొన్ని చిట్ చాట్ ప్రశ్నలకు ఆన్సర్స్ ఇచ్చారు. “ముందుగా దేవుడికి, నా మెదక్ ప్రజలకు థ్యాంక్స్ చెప్పాలి. నాకు ఎనిమిదవ తరగతి నుంచే డాన్స్ అంటే చాల ఇష్టం. అందరి ముందు చేయాలంటే సిగ్గు అందుకే గోడ మధ్యలో ఒక చిన్న అద్దం పెట్టుకున్నా డాన్స్ చేసేవాడిని అందులో నా తల ఒక్కటే కనిపించేది నా బాడీ కనిపించేది కాదు ఎలా ఎలా అని ఆలోచించేవాడిని. అప్పుడు ఒక ఐడియా వచ్చింది తెల్లవారుజామున లైట్ కింద డాన్స్ చేసేవాడిని. అందరూ లైట్ కింద చదువుకునే వాళ్ళు నేను డాన్స్ చేశా. అలా డాన్స్ నా ప్రొఫెషన్ ఐపోయింది నేను ఢీ సీజన్ 2 విన్నర్ అయ్యా అదే ఢీ షోకి జడ్జ్ గా వస్తున్నా.

నేను ఎఫ్దిసిలో ట్రైనింగ్ తీసుకున్నా. అప్పుడే తెలుగు ఇండస్ట్రీ తమిళ్ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అవుతోంది. అలా ఇక్కడ హైదరాబాద్ లో డాన్సర్స్ ని డెవలప్ చేయాలనీ దాసరి నారాయణరావు గారు నిర్ణయించుకుని మా అందరికీ టెస్ట్ పెట్టారు. అలా అక్కడ పాస్ అయ్యి డాన్సర్ గ ఆయన బ్లెస్సింగ్స్ తో మొదలయ్యాను. ఒసేయ్ రాములమ్మ మూవీ టైం కొంత ఇన్సల్ట్ కి గురయ్యా కానీ దాసరి గారు కొండంత బలాన్ని ఇచ్చి బాగా ఎంకరేజ్ చేసారు. పవన్ కళ్యాణ్ సర్ సాంగ్స్ ఛాలెంజింగ్ గా అనిపిస్తాయి. ఆయన పెద్ద స్టార్. ఒక్కో షాట్ పర్ఫెక్ట్ గా రావాలని చూస్తూ ఉంటాను. చిరంజీవి గారితో డాంసింగ్ సాంగ్ చేయాలని ఉంది. అవకాశం రావాలని దేవుడికి ప్రేయర్ చేస్తున్నా. ” అని గణేష్ మాష్టర్ చెప్పుకొచ్చారు.

 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here