ఇక సాఫ్ట్వేర్ విషయానికొస్తే మోటో జీ05 ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేస్తుంది. రెండేళ్ల పాటు అప్డేట్స్ ఇస్తామని సంస్థ చెబుతోంది. బ్యాటరీ విషయానికొస్తే, ఈ డివైస్ 5,200 ఎంఏహెచ్ యూనిట్‌ని కలిగి ఉంది. ఇది 70 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్, 39 గంటల టాక్ టైమ్, 19 గంటల వీడియో ప్లేబ్యాక్, 28 గంటల ఇంటర్నెట్ బ్రౌజింగ్‌ని అందిస్తుంది. మోటోరోలా ఐపీ52 వాటర్ రిపెల్లెంట్ రేటింగ్, వాటర్ టచ్ టెక్నాలజీ ఫీచర్ వంటి అదనపు ఫీచర్లను కూడా ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ కలిగి ఉంది.