హ్యుందాయ్ క్రెటా ఈవీ వర్సెస్ మారుతీ సుజుకీ ఈ విటారా..

కాంపాక్ట్ ఎలక్ట్రిక్ ఎస్​యూవీ సెగ్మెంట్​లో క్రెటా ఈవీకి ప్రధాన ప్రత్యర్థిగా రాబోయే మారుతీ సుజుకీ ఈ విటారా ఉంటుందని అంచనాలు ఉన్నాయి. ఈ రెండు ఎలక్ట్రిక్ కార్ల ఐసీఈ వర్షెన్లు అయిన క్రెటా, గ్రాండ్ విటారా ఎస్​యూవీలకు సూపర్​ డిమాండ్​, దానికి మించిన సూపర్​ పోటీ ఉంది. మారుతీ సుజుకీ తొలి ఎలక్ట్రిక్​ వాహనంలో 49 కిలోవాట్, 61 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్​తో ప్రత్యర్థుల కంటే అతిపెద్ద బ్యాటరీ సామర్థ్యాన్ని అందుస్తుంది. ఈ విటారా ఎలక్ట్రిక్​ ఎస్​యూవీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్లకు పైగా రేంజ్​ని అందించగలదని మారుతీ సంస్థ తెలిపింది. అయితే బ్యాటరీకి సంబంధించిన కరెక్ట్​ రేంజ్​ వివరాలను మాత్రం వెల్లడించలేదు. పెద్ద బ్యాటరీ ఉన్న క్రెటా ఈవీ రేంజ్ పరంగా ఎంట్రీ లెవల్ ఈ విటారా వేరియంట్​తో పోటీ పడుతుందని భావిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here