ప్రముఖ ఓటిటి మాధ్యమం ‘ఆహా’ లో స్ట్రీమింగ్ అయ్యే బాలకృష్ణ(Balakrishna)వన్ మాన్ షో ‘అన్ స్టాపబుల్'(UnStoppable)కి ఉన్న క్రేజ్ తెలిసిందే.ప్రస్తుతం నాలగవ సీజన్ స్ట్రీమింగ్ అవుతుంది. రీసెంట్ గా నిన్న టెలికాస్ట్ అయిన ఎపిసోడ్ కి బాలయ్య అప్ కమింగ్ మూవీ ‘డాకు మహారాజ్’ టీం హోస్ట్ గా వచ్చింది.

ఈ సందర్భంగా నిర్మాత నాగవంశీ(Naga Vamsi)తో బాలకృష్ణ మాట్లాడుతు హీరోయిన్ ‘రష్మిక'(rashmika)పెళ్లి అనే  టాక్ వస్తుంది కదా అని అడిగాడు.అందుకు నాగవంశీ మాట్లాడుతు తెలుగు హీరోతోనే పెళ్లి అంటున్నారు. కానీ ఆ హీరో ఎవరనేది చెప్పడం లేదని బదులిచ్చాడు.బాలయ్య అంతటితో ఆగకుండా ఆమె నీకు చెప్పడం లేదా కాస్త లీక్ చేయొచ్చు కదా అనగానే,ఆమె ఏం చెప్పలేదు.నాకు మాత్రం హీరో నుంచి హింట్స్ వస్తున్నాయని వంశీ చెప్పడం జరిగింది.ఆ వెంటనే వంశీ పక్కనే ఉన్న థమన్(taman)అంటే నీకు ఆ హీరో ఎవరో తెలుసనీ అన్నాడు. నాగవంశీ విషయానికి వస్తే  విజయ్ దేవరకొండ అప్ కమింగ్ మూవీని నాగవంశీ నే అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్నాడు.వీడీ 12 గా తెరకెక్కుతున్న ఈ మూవీకి  జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకుడు.ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ ని జరుపుకుంటూ ఉంది.

ఈ కారణంతోనే రష్మిక ప్రస్తావనని నాగవంశీ దగ్గర బాలకృష్ణ తీసుకొచ్చినట్టుగా నెటిజన్స్ చర్చించుకుంటున్నారు.ఎందుకంటే రష్మిక, విజయ్ దేవరకొండ(vijay devarakonda)ప్రేమలో ఉన్నారని ఎప్పట్నుంచో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.ఆ ఇద్దరు చాలా సందర్భాల్లో మేము లవ్ లో ఉన్నామనే విషయాన్నీ బహిరంగంగా చెప్పలేదు.ప్రస్తుతానికి అయితే మాత్రం మంచి స్నేహితులుగా ఉన్నారు.రీసెంట్ గా జరిగిన క్రిస్మస్ సెలబ్రేషన్స్ కి ఇద్దరు కలిసి అవుట్ అఫ్ కంట్రీ వెళ్లారు.ఈ ప్రాసెస్ లో ముంబై ఎయిర్ పోర్ట్ లో ఇద్దరు కలిసి ఫొటోలకి పోజులు కూడా ఇచ్చారు.  

 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here