కార్తీక్, దీప దగ్గరికి తీసుకెళతావా..
జోత్స్న ఏమైనా అందా అని సుమిత్ర అడిగితే.. ఏం లేదంటాడు దాసు. కార్తీక్, దీప విషయంలో జోత్స్న చేసే పనులు దాని మీద చాలా కోపంగా ఉందని, కానీ కూతురు కదా మారుతుందనే ఆశ ఉందని సుమిత్ర అంటుంది. దాన్ని చూస్తే కాస్త మారినట్టే అనిపిస్తుందని చెబుతుంది. ఓ చిన్న సాయం చేస్తావా అని దాసును అడుగుతుంది. వదినను, కార్తీక్‍ను, దీపను, చంటిదాన్ని చూడాలని తనకు అనిపిస్తుందని, వాళ్ల దగ్గరికి తీసుకెళతావా అని అడుగుతుంది. దీంతో “వెళదాం పదండి వదినా. దీప మీద తల్లిలా మీ ప్రేమ ఎప్పటికీ ఇలాగే ఉండాలి. రండి వెళదాం” అని దాసు చెబుతాడు. కార్తీక్, దీప వద్దకు బయలుదేరతారు. దీంతో కార్తీక దీపం 2 నేటి (జనవరి 4) ఎపిసోడ్ ముగిసింది.