కరీంనగర్ జిల్లాలో 82 శాతం…
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల సర్వే కరీంనగర్ జిల్లాలో 82 శాతం పూర్తయింది. జిల్లా వ్యాప్తంగా 2,10,677 దరఖాస్తులు రాగా ఇప్పటి వరకు గ్రామాల్లో 88 శాతం, మున్సిపాలిటీలైన జమ్మికుంటలో 96.94 శాతం, హుజురాబాద్ లో 90.75 శాతం, చొప్పదండిలో 84.01 శాతం, కొత్తపల్లిలో 72.15 శాతం, కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో 56 శాతం సర్వే పూర్తయినట్లు కలెక్టర్ పమెలా సత్పతి ప్రకటించారు. త్వరగా పూర్తిచేసేలా ప్రణాళిక బద్ధంగా ముందుకు పోతున్నామని తెలిపారు.