రాంగోపాల్‌పేట పోలీసులు అల్లు అర్జున్‌కు నోటీసు జారీ చేశారు. సంధ్య థియేటర్ ఘటనలో గాయపడి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను పరామర్శించేందుకు రావద్దని ముందుగానే నోటీసు పంపించారు. శ్రీతేజ్‌ను పరామర్శించేందుకు అల్లు అర్జున్ వస్తున్నారన్న విషయం తెలుసుకున్న పోలీసులు తాజాగా ఈ నోటీసు జారీ చేశారు. అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి అతని మేనేజర్ మూర్తికి నోటీసు అందించారు. హాస్పిటల్‌కు రావాలంటే తమ సూచనలు పాటించాలని, అక్కడ ఏదైనా ఘటన జరిగితే పూర్తి బాధ్యత అల్లు అర్జున్ వహించాల్సి ఉంటుందని ఆ నోటీస్‌లో పేర్కొన్నారు. మరి దీనిపై అల్లు అర్జున్ ఎలా స్పందిస్తారో చూడాలి.