ఏపీలో 1.88 కోట్ల ఎకరాల భూములు 22ఏ నిషేధిత జాబితాలో ఉన్నాయని ఇటీవల మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. వీటిలో దేవదాయ, ప్రభుత్వ భూములు, ఇతర కేటగిరీ భూములు ఉన్నాయన్నారు. దేవదాయ, ప్రభుత్వ భూములు మినహా పేదలకు నివేశనా స్థలాలు, సాగు పట్టాలుగా ఇచ్చినవి దశాబ్దాలు గడుస్తున్నా ఇప్పటికీ 22ఏలోనే ఉన్నాయన్నారు. దీంతో పేదలకు లబ్ధి కలిగించాలన్న ఉద్దేశంతో వాటిని 22ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. వైసీపీ హయాంలో పేదల భూములను కొట్టేయాలనే ఉద్దేశంతో అక్రమంగా కొందరి భూములను 22ఏలో చేర్చారన్నారు. 22ఏ కేటగిరీపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామన్నారు. రెవెన్యూ సదస్సులలో ముఖ్యంగా 32 రకాల అర్జీలు వస్తున్నాయని, ఆర్‌ఓఆర్‌కు సంబంధించి 1.01 లక్షల అర్జీలు, సర్వే వివాదాలపై 7 వేల అర్జీలు వచ్చాయన్నారు.
Home Andhra Pradesh ఏపీలో జనవరి 20 నుంచి భూముల రీసర్వే, త్వరలో 22ఏ భూములపై నిషేధం ఎత్తివేత-ap govt...