అప్లొడ్ చేయాల్సిన ధ్రువీకరణ పత్రాలు
అర్హతలు, అనుభవం, వయస్సుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు అందజేయాల్సి ఉంటుంది. అలాగే రైటింగ్ స్కిల్స్ టెస్ట్, ఇంటర్వ్యూ హాజరైన అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికేట్లు తీసుకురావల్సి ఉంటుంది. అభ్యర్థి విద్యా అర్హత, అనుభవం, పాస్‌పోర్టు సైజ్ పోటో, రెజ్యూమ్ తదితర డాక్యుమెంట్లను పీడీఎఫ్ ఫాంలో అప్లోడ్ చేయాలి. అసంపూర్ణంగా ఉండే దరఖాస్తులు తిరస్కరిస్తారు. షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు మాత్రమే, వారి ఈ-మెయిల్స్‌కు ఇంటర్వ్యూ కాల్ లెటర్ పంపిస్తారు.