దందా ఇలా..
మంత్రులు, చాలామంది ఎమ్మెల్యేలు, కొందరు ఎంపీల దగ్గర పనిచేసే వ్యక్తిగత సిబ్బంది జేబులు నింపుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా కాంట్రాక్ట్ పోస్టుల భర్తీ, అంగన్‌వాడీ పోస్టుల భర్తీ, ఇసుక, మైనింగ్, టీటీడీ సిఫారసు లేఖలు, పోలీస్ కేసులు, లిక్కర్ మాఫియా, ప్రభుత్వ విద్యా సంస్థల్లో సిబ్బంది నియామకం, కాంట్రాక్టులు, భూదందాలు, సెటిల్‌మెంట్లు చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.