వీకెండ్ వచ్చిందంటే భోజనంలోకి చికెన్ లేదా మటన్ ఉండాల్సిందే. చాలా పండుగలు, ప్రత్యేక రోజుల్లో కూడా మాంసాహారానికి ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. అయితే రుచిగా, మృదువుగా లేకపోతే చికెన్ లేదా మటన్ తిన్న తృప్తి కూడా ఉండదు. కొన్నిసార్లు మాంసం ఉడకకుండా, మరికొన్ని సార్లు అన్ని ముక్కలకు మసాలా రుచిపట్టకుండా ఉంటుంది. అలాంటప్పుడు తిన్న తర్వాత కాస్త నిరాశ కనిపించొచ్చు. అతిథుల ముందు ఇది అవమానంగా కూడా అనిపించొచ్చు. ఇలాంటి సమస్య రాకుండా ఉండాలంటే మటన్ లేదా చికెన్ వండేటప్పుడు తప్పకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని ఉన్నాయి. ఈ చిట్కాలు పాటించి మృదువైన, రుచికరమైన చికెన్ లేదా మటన్‌ను మీరు ఎంజాయ్ చేయొచ్చు. అతిథులతోనూ ఔరా అనిపించుకోవచ్చు.