అసలేం జరిగింది?
తాడిపత్రిలోని మహిళల కోసం జేసీ ప్రభాకర్ రెడ్డి…జేసీ పార్క్‌లో న్యూఇయర్ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు మహిళలకు మాత్రమే అనుమతి అని చెప్పారు. అయితే ఈ కార్యక్రమానికి మహిళలు వెళ్లొద్దంటూ సినీ నటి, బీజేపీ నేత మాధవీ లత ఓ వీడియో విడుదల చేశారు. జేసీ పార్క్ లో గంజాయి బ్యాచ్‌లు ఉంటాయని, దాడులు చేస్తే ఎవరిది బాధ్యత వహిస్తారని ఆమె ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై జేసీ ప్రభాకర్ రెడ్డి కాస్త ఘాటుగా రియాక్ట్ అయ్యారు. తాడిపత్రి ప్రజలను గంజాయి బ్యాచ్‌తో పోలుస్తారా? అంటూ మాధవీ లతపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియా సమావేశంలో మాధవీ లతను ప్రొస్టి** అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆమెను బీజేపీలో ఎందుకు చేర్చుకున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. జేసీ బస్సులు దగ్దం వెనుక బీజేపీ నేతల కుట్ర ఉందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రభుత్వమే నయం అన్నారు.