రైతు భరోసా స్కీమ్ ఏంటి..?
గత బీఆర్ఎస్ హయాంలో రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు రైతుబంధు పథకాన్ని తీసుకొచ్చింది. ఎకరానికి రూ. 5వేల చొప్పున… ఏడాదికి రూ. 10వేలు ఇచ్చేది. అయితే తాము అధికారంలోకి వస్తే ఎకరానికి రూ. 15వేల పంట పెట్టుబడి సాయం అందిస్తామని కాంగ్రెస్ పార్టీ మెనిఫెస్టోలో ప్రకటించింది. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో.. రైతుబంధు పేరును కాకుండా.. రైతు భరోసా పేరుతో పంట పెట్టుబడి సాయం అందించనుంది. అయితే ఎకరానికి రూ. 15వేలు కాకుండా.. రూ. 12 వేల సాయం అందించాలని నిర్ణయించింది.