వాస్తవానికి ఆదివారం (జనవరి 5న) ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, అటవీశాఖ మంత్రి కొండా సురేఖ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క చేతుల మీదుగా ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు. కానీ మంత్రుల బిజీ షెడ్యూల్ కారణంగా ఎలక్ట్రిక్ బస్సుల ప్రారంభోత్సవాన్ని సోమవారానికి వాయిదా వేశారు. సోమవారం నిర్వహించే ఎలక్ట్రిక్ బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రులు హాజరవుతారా లేదా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.