వైసీపీ హయాంలో రైతుభరోసా పేరిట రైతులకు పెట్టుబడి సాయం అందించేవారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పేరిట కేంద్రం ఏటా అందించే రూ.6 వేలకు మరో రూ.7,500 కలిపి ఏటా రూ.13,500 అందించేవారు. ఎన్నికల హామీల్లో ఈ మొత్తాన్ని రూ.20 వేలకు పెంచుతామని కూటమి పార్టీలు ప్రకటించాయి. కూటమి ప్రభుత్వం ఈ హామీ అమలుపై దృష్టి సారించింది. మూడు విడతల్లో రూ. 20 వేలు సాయం అందించేంందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే అన్నదాత సుఖీభవ పేరిట పోర్టల్ ప్రారంభించింది. అన్నదాత సుఖీభవ పథకం కింద పీఎం కిసాన్ నిధులు రూ.6 వేలకు మరో 14 వేలు కలిపి రూ.20 వేలు అందించనున్నారు.
Home Andhra Pradesh అన్నదాత సుఖీభవ పథకంపై అప్డేట్, ఆ నెలలో నిధులు విడుదల-త్వరలో విధివిధానాలు!-annadata sukhibhava scheme update...