ప్రస్తుతానికి కొన్ని మోడళ్ల పేర్లు మాత్రమే ప్రకటించారు. 2025 మొదటి త్రైమాసికంలో డుకాటీ డెసర్ట్‌ఎక్స్ డిస్కవరీ, సరికొత్త 7వ తరం పానిగేల్ V4ని విడుదల చేస్తుంది. రెండో త్రైమాసికంలో పానిగేల్ V2 ఫైనల్ ఎడిషన్, 2వ జనరేషన్ స్క్రాంబ్లర్ డార్క్‌ను విడుదల చేస్తారు. మూడో త్రైమాసికంలో స్ట్రీట్‌ఫైటర్ V4, స్ట్రీట్‌ఫైటర్ V2, పానిగేల్ V2లతో పాటు మల్టీస్ట్రాడా V2, స్క్రాంబ్లర్ రిజోమాలను విడుదల చేయనుంది కంపెనీ.