సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh babu)ప్రస్తుతం రాజమౌళి(Rajamouli)మూవీకి సంబంధించిన ప్రిపరేషన్ పనుల్లో బిజీగా ఉన్నాడు.ఎటువంటి హడావిడి లేకుండా జనవరి 2 న పూజా కార్యక్రమాలతో ప్రారంభమయ్యిన ssmb 29 అమెజాన్ అడవుల నేపథ్యంలో తెరకెక్కనుంది.బాహుబలి సిరీస్ తో పాటు ఆర్ ఆర్ఆర్ లాంటి ప్రతిష్టాత్మక చిత్రాలకి కథని అందించిన విజయేంద్రప్రసాద్ కథని అందిస్తుండటంతో మూవీపై మహేష్ అభిమానుల్లోనే కాకుండా ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి.
మహేష్ రీసెంట్ గా వర్సటైల్ యాక్టర్ సోనుసూద్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఫతేహ్’ అనే సినిమా ట్రైలర్ ని సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేసాడు.అనంతరం ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తు యాక్షన్ ప్యాక్డ్ గా సిద్దమైన ఈ మూవీ ట్రైలర్ చూడటానికి ఎంతో అద్భుతంగా ఉంది.నా స్నేహితుడు సోనుసూద్ కి ఆల్ ది బెస్ట్.ప్రతి ఒక్కరు ఈ చిత్రాన్ని వెండి తెరపై వీక్షించాలని కోరుకుంటున్నాను.సినిమా కూడా ఘన విజయం సాధిస్తుందంటూ ‘ఎక్స్’ వేదికగా తెలిపాడు.
సోనుసూద్(sonu sood)కూడా రిప్లై ఇస్తు ‘లవ్ యు బ్రదర్ మనిద్దరం కలిసి సినిమా చూద్దామని చెప్పుకొచ్చాడు.సోనుసూద్, మహేష్ లు కలిసి దూకుడు,ఆగడు వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులని ఎంతగానో మెప్పించారు.ఇక ‘ఫతేహ్’ మూవీ సైబర్ మాఫియా ఆధారంగా తెరకెక్కగా జాక్వలిస్ ఫెర్నాండేజ్ హీరోయిన్ గా చేస్తుంది.విజయ్ రాజ్,నసీరుద్దీన్ షా,భట్టాచార్య వంటి మేటి నటులు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు.జనవరి 10 న మూవీ విడుదల కానుంది