వెంట్రుకల ఆరోగ్యం కోసం కొబ్బరి నూనె వాడి ఉంటారు. ఉసిరి, బాదం నూనెలను కూడా ఉపయోగించి ఉంటారు. కానీ అల్లం నూనె ఎప్పుడైనా వాడారా? అసలు ఈ పేరైనా విన్నారా? అల్లం నూనె గురించి తెలియని వారు వెంట్రుకల విషయంలో చాలా లాభాలను మిస్ అయ్యారనే చెప్పాలి. ఎందుకంటే అల్లం కేవలం వంటలకు ఉపయోగించే పదార్థం మాత్రమే కాదు. అందమైన, ఆరోగ్యకరమైన జుట్టు కోసం సహాయపడే గొప్ప సాధనం. అల్లంలోని యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు వెంట్రుకలను కుదుళ్ల నుంచీ బలంగా తయారుచేసేందుకు సహాయపడతాయి. అల్లం నూనెను ఉపయోగించడం వల్ల జుట్టు రాలడం సమస్య తగ్గడంతో పాటు సిల్కీగా , స్మూత్ గా, ఆరోగ్యంగా తయారవుతుంది. అందమైన మెరిసే కురులను మీ సొంతంచేస్తుంది.