గాడ్ ఆఫ్ మాసస్ నందమూరి బాలకృష్ణ,దర్శకుడు గోపీచంద్ కాంబోలో తెరకెక్కిన మూవీ వీర సింహారెడ్డి. 2023 లో వచ్చిన ఈ మూవీ ద్వారా తెలుగు ప్రేక్షకులని అలరించిన భామ హానీ రోజ్ ..మలయాళ చిత్ర పరిశ్రమకి చెందిన హానీ వీర సింహారెడ్డి లో రెండు వేరియేషన్స్ తో కూడిన క్యారక్టర్ లో అద్భుతంగా నటించింది.
రీసెంట్ గా హనీ సోషల్ మీడియా లో ఒక పోస్ట్ చేసింది.తనని ఒక బిజినెస్ మాన్ వెంబడిస్తూ లైంగిక వేధింపులకి గురి చేస్తున్నాడంటూ పోస్ట్ లో పేర్కొంది.ఇప్పుడు ఈ విషయం మలయాళ చిత్ర పరిశ్రమతో పాటు సౌత్ చిత్ర పరిశ్రమలోను సంచలనం సృష్టిస్తుంది. మలయాళ చిత్ర పరిశ్రమలో నటీమణులు ఎదురుకుంటున్న లైంగిక వేధింపులని అరికట్టడానికి అక్కడి ప్రభుత్వం ఇటీవల జస్టిస్ హేమ కమిటీ ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే.