టాటా పంచ్ లాంచ్ టైమ్ నుంచే రికార్డులు బ్రేక్ చేస్తూ వెళుతోంది. డెలివరీలు ప్రారంభించిన పది నెలల్లోనే తొలి లక్ష ఉత్పత్తి మైలురాయిని ఈ ఎస్యూవీ తాకింది. తర్వాతి లక్ష.. 2023 మే నాటికి రాగా, మూడో లక్ష 2024 జనవరి ప్రారంభంలో వచ్చేసింది. ఎనిమిది నెలల తర్వాత నాలుగో లక్ష ఉత్పత్తి మైలురాయిని అందుకున్న నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి కీలకమైన 5 లక్షల మార్కుపై పడింది.