కెమెరా ఫీచర్లు
క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 ఆక్టాకోర్ ప్రాసెసర్‌పై వన్ ప్లస్ 12 5జీ పనిచేయనుంది. కెమెరా విషయానికొస్తే వన్‌ప్లస్ 12 ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 48 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఆక్సిజన్ ఓఎస్‌పై ఈ ఫోన్ పనిచేస్తుంది.