వ్యతిరేకతను అధిగమిస్తేనే విజయం దక్కుతుందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. యువ పారిశ్రామిక వేత్తలకు కీలక సూచనలు చేశారు. గత మూడు రోజులుగా ‘కనెక్ట్, కొలాబరేట్, క్రియేట్’ ఇతివృత్తంతో హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో జరుగుతున్న అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్(ఆప్తా) పెట్టుబడిదారుల ప్రపంచ వ్యాపార సదస్సు ముగింపు సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడారు.