కల్కి సినిమాపై హైందవ శంఖారావం సభలో సినీ గేయ రచయిత అనంత్ శ్రీరాం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మూవీలో కర్ణుడి పాత్రను హైలెట్ చేశారని మండిపడ్డారు. ఇలాంటి వక్రీకరణలు చూసి తాను సిగ్గుపడుతున్నానని వ్యాఖ్యానించారు. ప్లాన్ ప్రకారమే సినిమాల్లో హైందవ ధర్మ హననం జరుగుతోందని ఆరోపించారు.