ప్రమాద దృశ్యాలను అటుగా వెళ్తున్న వాహనదారులు వీడియోలు తీశారు. మృతదేహాలు మాంసపుముద్దలుగా మారాయి. మృతులను ఉప్పల్ కు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. వరంగల్ నుంచి హైదరాబాద్ వైపు వస్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది. ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.