బంజారాహిల్స్ ఏసీబీ కార్యాలయం ముందు కేటీఆర్ వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. న్యాయవాదులు ఎవరు కూడా కేటీఆర్ వెంట వెళ్లకూడదని పోలీసులు చెప్పారు. దీంతో కేటీఆర్ ఫైర్ అయ్యారు. చట్ట ప్రకారం ప్రతి పౌరుడికి ఉన్న హక్కులను వినియోగించుకుంటారని చెప్పారు. అలా కాదంటే ఇటే ఇంటికి వెళ్లిపోతానని పోలీసులకు తెగేసి చెప్పారు. ఇక ఫార్ములా ఈ రేస్ కేసులో ఇవాళ విచారణ నిమిత్తం ఏసీబీ కేటీఆర్ ను పిలిపించింది.