ఇంటర్ రెగ్యులర్, ఒకేషనల్ విద్యార్థులకు ఫిబ్రవరి 3, 2025 నుంచి ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి. ఫిబ్రవరి 22, 2025తో పూర్తి అవుతాయి. రెండు సెషన్లలో ఉదయం 9 నుంచి 12 గంటల వరకు… మధ్యాహ్నం 2 నుంచి 5 వరకు ప్రాక్టికల్ పరీక్షలను నిర్వహిస్తారు. ఇక తుది పరీక్షల టైం టేబుల్ ను కూడా ఇప్పటికే ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసిన సంగతి తెలిసిందే.