వ్యక్తిగత రుణంపై ప్రభావం ఎంత..?
బ్యాంకులు వడ్డీ రేట్లను వసూలు చేసేందుకు కొన్ని విషయాలను పరిగణలోకి తీసుకుంటాయి. అవి.. డిపాజిట్ రేట్లు, రెపో రేట్లు, నిర్వహణ వ్యయాలు, నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్) వంటి అంశాలను కలిగి ఉన్న మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత లెండింగ్ రేటు (లేదా ఎంసీఎల్ఆర్). కాబట్టి ఆర్బీఐ రెపో రేటు, సీఆర్ఆర్ని పెంచినప్పుడు, బ్యాంకులు నిధులను సమీకరించడానికి అదనపు ఖర్చు చేయాల్సి వస్తుంది. తద్వారా రుణ వ్యయం పెరుగుతుంది. ఇది బ్యాంకులు వసూలు చేసే అధిక వడ్డీ రేట్లకు దారితీస్తుంది.