అన్ని సెక్టార్లు గ్రీన్ లో..
నిఫ్టీ ఐటీ మినహా అన్ని ప్రధాన సెక్టోరల్ ఇండెక్స్ లు మంగళవారం ఆకుపచ్చ రంగులో స్థిరపడగా, నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్ 1.64 శాతం లాభపడింది. నిఫ్టీ మీడియా, నిఫ్టీ ఎనర్జీ, నిఫ్టీ మెటల్, నిఫ్టీ సీపీఎస్ఈ, నిఫ్టీ ఇన్ఫ్రా 0.8 శాతం నుంచి 1.36 శాతం మధ్య లాభపడ్డాయి. వ్యక్తిగత స్టాక్స్ పరంగా చూస్తే నిఫ్టీ 500 షేర్లలో కిర్లోస్కర్ బ్రదర్స్ టాప్ పెర్ఫార్మర్ గా అవతరించింది. ఏజిస్ లాజిస్టిక్స్, ఇంటెలిజెన్స్ డిజైన్ ఎరీనా, పీటీసీ ఇండస్ట్రీస్, రాష్ట్రీయ కెమికల్స్, విజయ డయాగ్నస్టిక్ సెంటర్, బయోకాన్, జస్ట్ డయల్, మరో 24 షేర్లు 4 శాతానికి పైగా లాభంతో ముగిశాయి.