గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan)శంకర్(Shankar)కలయికలో తెరకెక్కిన ‘గేమ్ చేంజర్'(Game changer)సంక్రాంతి  కానుకగా ఈ నెల 10 న విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.ట్రైలర్ తో పాటు ప్రచార  చిత్రాలు కూడా ఒక  రేంజ్  లో ఉండడటంతో మెగా ఫాన్స్ తో పాటు ప్రేక్షకుల్లో కూడా గేమ్ చేంజర్ పై  భారీ అంచనాలే  ఉన్నాయి. 

ఇక ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో విడుదల కాబోతుంది.ఈ నేపథ్యంలో మొదటి రోజు ఎన్ని స్క్రీన్స్ లలో  షో పడబోతుండమనే చర్చ ఇప్పుడు అందరిలో మొదలయింది ఎందుకంటే నిర్మాత దిల్ రాజు ఇటీవల మాట్లాడుతు గేమ్ చేంజర్ ఫస్ట్ డే భారీ స్థాయిలో రిలీజ్ కాబోతుందని చెప్పాడు.దీంతో తొలి రోజు  దేవర(devara) 8000 స్క్రీన్స్ లో,పుష్ప 2 12000 స్క్రీన్స్ లో షోస్  పడగా గేమ్ చేంజర్ ఎన్ని స్క్రీన్స్ లో షో పడనుందనే ఆసక్తి అందరిలో ఉంది.

తెలంగాణ లో ఇటీవల జరిగిన సంధ్య థియేటర్ ఘటనతో  బెనిఫిట్ షో తో పాటు అధిక రేట్స్ కి టికెట్స్ అమ్మకూడదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన విషయం తెలిసిందే.ఈ విషయంపై కూడా దిల్ రాజు(Dil raju)ఇటీవల మాట్లాడుతు సినిమా ధరల విషయంలో ముఖ్యమంత్రితో మాట్లాడబోతున్నానని,ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా దాని ప్రకారమే వెళ్తామని చెప్పాడు.ఇక చరణ్ డ్యూయల్  రోల్  పోషిస్తున్న గేమ్ చేంజర్ లో కియారా  అద్వానీ అంజలి  హీరోయిన్లుగా చెయ్యగా  బ్రహ్మ్మనందం,ఎస్ జె సూర్య,సునీల్,సముద్ర  ఖని కీలక పాత్రలు పోస్తిస్తున్నారు. థమన్  సంగీత దర్శకుడు కాగా ఇప్పటికే పాటలు  బ్లాక్  బస్టర్  హిట్స్  గా  నిలిచిన  విషయం తెలిసిందే.

 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here