అన్ని సౌకర్యాలతో జంక్షన్
శామీర్‌పేట్, మేడ్చల్ మెట్రోలు ఒకేచోట ప్రారంభమయ్యేలా చూసుకోవాలని… అక్కడ అధునాతన వసతులు, భవిష్యత్ అవసరాలకు తగినట్లు భారీ జంక్షన్ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఆయా ప్రాంతాల వారు ప్రతి పనికి నగరంలోకి రానవసరం లేకుండా అక్కడే అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేలా ఆ జంక్షన్‌ను అభివృద్ధి చేయాలన్నారు. జంక్షన్‌కు సంబంధించిన పూర్తి ప్రణాళికను తయారు చేయాలని సీఎం ఆదేశించారు. హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్‌జీసీఎల్) కింద రేడియల్ రోడ్ల నిర్మాణం చేపట్టాలని సీఎం సూచించారు.