జగిత్యాల జిల్లా కొడిమ్యాల ఎస్సై సందీప్ పరిమితికి మించి వ్యవహరించాడు. పోలీసులను గమనించకుండా వెళ్లిన బాధితున్ని ఎస్సై సందీప్ చితకబాదాడు. దీంతో బాధితుడు రాజేందర్ కర్ణభేరి దెబ్బతింది. ఇంటికెళ్లి ఈడ్చుకొచ్చి ఎస్సై తనని కొట్టాడని బాధితుడు ఆరోపిస్తున్నాడు. తల్లిదండ్రులు, భార్య పిల్లలు కాళ్లు మొక్కిన ఎస్సై కనికరించ లేదని వాపోయాడు. ఆసుపత్రిలో చూయించుకున్న అనంతరం జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ కు రాజేందర్ ఫిర్యాదు చేశాడు. భూ తగాదాలోనూ ఎస్సై సందీప్ పై ఎస్పీకి మరో ఫిర్యాదు అందింది.