భూకంపం తర్వాత చైనా భూకంప అడ్మినిస్ట్రేషన్ లెవల్-2 ఎమర్జెన్సీ సర్వీస్ రెస్పాన్స్ ప్రారంభించింది. విపత్తు సహాయక చర్యల్లో సహాయపడటానికి టాస్క్ ఫోర్స్ ను సంఘటనా స్థలానికి పంపారు. కాటన్ టెంట్లు, కాటన్ కోటులు, దుప్పట్లు, మడతపెట్టే పడకలతో సహా సుమారు 22,000 విపత్తు సహాయ సామగ్రిని పంపించారు. అలాగే ఎత్తైన ప్రాంతాలు, శీతల ప్రాంతాలకు ప్రత్యేక సహాయ సామగ్రిని పంపిస్తున్నారు. 1500 మందికి పైగా స్థానిక అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి వెళ్లారు.
Home International Earthquake : నేపాల్-టిబెట్ సరిహద్దుల్లో భారీ భూకంపం.. 53 మంది మృతి, పలు భవనాలు నేలమట్టం-several...