Formula E Case : ఫార్ములా-ఈ రేస్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తెలంగాణ హైకోర్టు కేటీఆర్ క్వాష్ పిటిషన్ కొట్టివేయడంతో ఏసీబీ దూకుడు పెంచింది. ఈ కేసులో భాగంగా ఏపీ, తెలంగాణలోని గ్రీన్ కో ఆఫీసుల్లో సోదాలు చేపట్టింది. గ్రీన్‌కో అనుబంధ సంస్థ ఫార్ములా ఈ రేస్ ప్రమోటర్ గా వ్యవహరించింది.