Nampally High Tension : నాంపల్లిలోని బీజేపీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. యూత్ కాంగ్రెస్ బీజేపీ ఆఫీసును ముట్టడికి ప్రయత్నించింది. కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ, మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. యూత్ కాంగ్రెస్ నేతలు బీజేపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో గొడవ మొదలైంది. దీంతో బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు పరస్పరం కర్రలతో దాడి చేసుకున్నారు. కర్రలతో కొట్టుకోవడంతో పాటు ఇరు పార్టీల కార్యకర్తలు రాళ్లు,కోడిగుడ్లు విసురుకున్నారు. ఈ క్రమంలో బీజేపీ కార్యకర్త తలకు గాయమైంది. కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ ప్రియాంక గాంధీపై దిల్లీకి చెందిన బీజేపీ నేత రమేష్ బిదూరీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దిల్లీ రోడ్లను ప్రియాంక గాంధీ బుగ్గల్లా మారుస్తామని బీజేపీ నేత రమేశ్ బిదూరీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. నాంపల్లిలోని బీజేపీ ఆఫీసు ముట్టడికి ప్రయత్నించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here