వ్యవసాయం చేస్తున్న, సాగు చేసేందుకు అనుకూలంగా ఉన్న భూములకు మాత్రమే రైతు భరోసా కింద రూ.12 వేలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. రాళ్లు, గుట్టలు, పరిశ్రమలకు ఇచ్చిన భూములు, రోడ్లు, వెంచర్ల వేసిన భూములకు రైతు భరోసా ఇవ్వమని స్పష్టం చేసింది. ఇలాంటి భూములున్న వారికి రైతు భరోసా దక్కదు. ఆదాయపు పన్ను చెల్లిస్తున్న వారికి పొలాలు ఉంటే వారికి కూడా రైతు భరోసా వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ పథకంపై పూర్తి విధి విధానాలు విడుదలైతే గానీ మరిన్ని విషయాలపై స్పష్టత రాదు.